- పోడు పోరాటం లో నా మీద 16 కేసులు
- పాయం..నీకు దమ్ము ఉంటే ఒక గుంట పోడు భూమి లాక్కో
- నా పోరాట ఫలితమే పోడు భూములకు పట్టాలు
- అత్యంత పారదర్శకంగా పోడు భూముల పట్టాల పంపిణీ
- బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
- పెండింగ్ పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి
- గిరి వికాస్ పథకం కింద పోడు భూములకు త్రీఫేజ్, బోరు సౌకర్యం
- అభివృద్ధి చేసే నాయకుడు కావాలా? చందాలు వసూలు చేసే నాయకుడు కావాలి
- బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు
మన్యం న్యూస్,పినపాక: పోడు సాగుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పై ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు నిప్పులు జరిగారు. తన పోరాట ఫలితంగానే ఆదిలాబాద్ నుండి అశ్వారావుపేట వరకు అర్హులైన ఆదివాసి గిరిజనులకు ముఖ్యమంత్రికి కెసిఆర్ పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆయన బుధవారం మండల పరిధి నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు పోడు పోరాటంలో తనపై 16 కేసులు నమోదైనట్లు రేగా కాంతారావు గుర్తు చేశారు .కాంగ్రెస్ పాలకుల వల్లే కాకుండా అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా పోడు సాగుదారులకు సరిహద్దులు నిర్ణయిస్తూ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మరల పోడు సాగుదారుల నుండి భూమి లాక్కుంటారని అసత్య ప్రచారానికి దిగడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసి గిరిజనుల అభివృద్ధికి అనుక్షణం తపిస్తారని, వారి అభివృద్ధి ధ్యేయంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు ,రైతు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టా పోడు భూములకు గిరి వికాస్ పథకం ద్వారా త్రీఫేజ్ సౌకర్యంతో, బోర్లు ఉచితంగా వేపిస్తామని అన్నారు. అభివృద్ధి చేసే నాయకుడు కావాలా? బినామీ కావాలా ప్రజలే ఆలోచన చేసుకోవాలి కోరారు.