మన్యం న్యూస్, కరకగూడెం:బీ ఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బైరిశేట్టి.రామారావుకాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కరకగూడెం సర్పంచ్ ఊకే.రామనాథం అధ్వర్యంలో పినపాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ఆయనకు బీ ఆర్ ఎస్ పార్టీ కండువ కప్పి సాధరణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.