- రేగా గెలిస్తే పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు
- మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం
- ప్రతిపక్షాల రూ.300 కావాలా? దళితుల జీవితాలు మార్చే దళిత బంధు కావాలా?
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండేరు రాము
మన్యం న్యూస్ ,పినపాక: పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు గెలిపిస్తే పైలెట్ ప్రాజెక్టుగా దళిత బందును అమలు చేస్తామని మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేరు రాము అన్నారు.దళితులను గుర్తించి వారి ఆర్థిక అభివృద్ధికి దళిత బందు ద్వారా సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండేరు రాము అన్నారు. గురువారం
పినపాక మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో దళితవాడలో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేరు రాము మాట్లాడుతూ… మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని,ప్రతిపక్షాల రూ.300 కావాలా? దళితుల జీవితాలు మార్చే దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కావాలా? అని , ఈ మేరకు దళిత సోదరులు ఆలోచన చేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ పినపాక నియోజకవర్గం నందు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో వాగ్దానం చేసిన పైలెట్ ప్రాజెక్ట్ కొనసాగించుట, విధి విధానాలు అధికారులకు వస్తే దళితులకు అందించే సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది . కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేగా కాంతారావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు పూససంతోష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.