UPDATES  

 ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు..

  • ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు
  • పోటీలో 95 మంది అభ్యర్థులు
  • జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

నామినేషన్లు పరిశీలన ఉపసంహరణ తదుపరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం

ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో పోటీలో ఉన్న అభ్యర్థులు, పోస్టల్ బ్యాలెట్ ఫారం 12, 12డి, ఓటరు సమాచార స్లిప్పులు పంపిణి, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, సీజర్సు

సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, శాంతిబద్రతలు పర్యవేక్షణ పరిశీలకులు తదితర అంశాలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేదీ

నుండి 10వ తేదీ వరకు ఐదు నియోజకవర్గాల్లో 136 మంది అభ్యర్థులు 211 సెట్లు నామినేషన్లు దాఖలు

చేశారని 13వ తేదీన పరిశీలనలో 16 మంది అనర్హులుగాను, 15వ తేదీన 25 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. పినపాకలో 18 మంది, ఇల్లందులో 20 మంది, కొత్తగూడెంలో 30

మంది, అశ్వారావుపేటలో 14 మంది, భద్రాచలంలో 13 మంది మొత్తం 95 మంది అభ్యర్థులు పోటీలో

ఉన్నట్లు చెప్పారు. వీరిలో గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల నుండి 20 మంది, రిజిష్టర్డ్ పొలిటికల్ పార్టీలు (గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలు కాకుండా) 28 మంది స్వతంత్ర్య

అభ్యర్థులు 47 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 471745 మంది పురుషులు, 494650 మంది మహిళలు, 44 ఇతరులు మొత్తం 966439 మంది

ఓటర్లున్నట్లు చెప్పారు. వీరిలో 732 మంది సర్వీసు ఓటర్లు, దివ్యాంగులు 13678 మంది, 18-19 సంవత్సరాల వయస్సున్న 27490 మంది, 80 సంవత్సరాలు పైబడిన వారు 13106 మంది ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల్లో

విధులు నిర్వహించు సిబ్బందికి 4500 పోస్టల్ బ్యాలెట్లు, అలాగే దివ్యాంగులకు, 80 సంవత్సరాలు పైబడిన

వయోవృద్ధులకు 725 పోస్టల్ బ్యాలెట్లుకు దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. దివ్యాంగులకు, 80 సంవత్సరాలు

పైబడిన వయోవృద్ధులు ఇంటి నుండి ఓటుహక్కు వినియోగానికి ఈ నెల 20వ ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయం ద్వారా షెడ్యూలు తయారు చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు, బూతుస్థాయి అధికారులు, పోలింగ్ ఏజెంట్లుతో ఇంటికెళ్లి వీడియో గ్రఫి ద్వారా ఓటుహక్కు వినియోగానికి చర్యలు

చేపట్టనున్నట్లు చెప్పారు. ఐదు నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగానికి అవసరమైన ఓటరు సమాచార

స్లిప్పులు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. ఓటరు స్లిప్పులు పంపిణి బూతుస్థాయి అధికారులు

ద్వారా పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. స్లిప్పులు పంపిణి సమాచారం పోటీచేయు అభ్యర్థులకు, బూతు ఏజెంట్లుకు

అందచేస్తున్నట్లు చెప్పారు. 1095 పోలింగ్ కేంద్రాల్లో 300 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.

512 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో

ఇప్పటి వరకు 2,93,73,711 నగదు, 2,48,01,333 మద్యం, ఇతర వస్తువులు మొత్తం కలిపి 6,85,11,795

కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు ముగ్గురు సాధారణ పరిశీలకులు

ఇద్దరు వ్యయ పరిశీలకులు శాంతిభద్రతలు పర్యవేక్షణకు ఇద్దరు పర్యవేక్షకులను ఎన్నికల సంఘం నియమించినట్లు చెప్పారు. పినపాక, ఇల్లందు నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన

హరికిషోర్ ఉదయం 9-10 గంటల మద్య ఐటిసి విశ్రాంతి భవనం, సారపాక, బూర్గంపాడు మండలంలో

ప్రజలకు, రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంటారని (6303713285) కొత్తగూడెంనకు నియమించిన సాధారణ పరిశీలకులు కమల్ కిషోర్, ప్రతి రోజు సాయంత్రం 4-5 గంటల వరకు సింగరేణి విశ్రాంతి

భవనం (ఇల్లందు గెస్ట్ హౌస్) నందు ప్రజలకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందుబాటులో ఉంటారని(6303743371) చెప్పారు. అలాగే భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా

నియమితులైన ఎస్ గణేష్, సింగరేణి విశ్రాంతి భవనం (ఇల్లందు గెస్ట్ హౌస్) నందు సాయంత్రం 5-6 మద్య

ప్రజలకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు (6303715534) అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రచారాలకు సంబంధించిన అనుమతులు సువిధ యాప్ ద్వారా 48 గంటల్లో అందచేయుటకు అవకాశం

ఉందని, అనుమతుల కొరకు సువిధ యాప్ ను వినియోగించుకోవాలని చెప్పారు.

ఈ సమావేశంలో డిపిఆర్డీ శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !