మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గుంపెనగుడెం గ్రామ సమీపంలోనీ తాలిపేరు నది నుంచి ఏటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రతిరోజు 5 నుండి 10 ట్రాక్టర్లతో ఇసుక రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇదివరకు మండలంలో అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జెసిబిలను సీజ్ చేస్తున్నప్పటికీ ఇసుక దందా మాత్రం యదేచ్చగా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొందరు బడబాబులు అధికారుల అండదండలతో ఇదేమి లెక్కచేయకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండికోడుతూ రాత్రి పగలు అనే తేడా లేకుండా మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై దృష్టి సారించలని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు.