మన్యం న్యూస్ ,అశ్వాపురం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను చైతన్యం పరచడానికే పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అశ్వాపురం సీఐ రవీందర్ తెలిపారు. సోమవారం మండల లోని మొండికుంట గ్రామంలో సెంట్రల్ ఆర్ముడు పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీస్ బలగాలను, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందని, మద్యం ,డబ్బు అక్రమ రవాణాను అరికట్టడానికి గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రవీంద్రర్ తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.