మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ, చతిస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పూసుగుప్ప, వద్ధిపేట,ఉంజిపల్లీ సంబంధిత ఆదివాసి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు ఆదివాసులతో మాట్లాడుతూ వద్ధిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు, ఇక్కడ నివసిస్తున్న ఆదివాసులకి కుల ధ్రువీకరణ పత్రం, అర్హులైన అందరికీ పోడుభూమి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి వర్తించే విధంగా కృషి చేస్తానని ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి అంటూ కోరారు.మండల కేంద్రములో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ చర్ల మెయిన్ రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అనంతరం సబ్బంపేట, కొయ్యూరు, రామాంజిపురం, రేగుంట, ఉప్పరిగూడెం గ్రామాలలో ప్రచార రథంతో బైక్ లపై రోడ్డు షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ మనే రామకృష్ణ, సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, భద్రాచలం ప్రచార కమిటీ అధ్యక్షులు బోలిషెట్టి రంగారావు, సోయం రాజారావు, లంక రాజు, కాపుల కృష్ణ, శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కోదండ రామయ్య, కాపుల నాగరాజు, కాకి అనిల్, ఆలం ఈశ్వర్, వినోద్,అరుణ్, పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.