- రేగాను గెలిపిస్తే నియోజకవర్గ పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం
- దళిత బిడ్డలం రూ.200 లకు ఆశపడదామా? బతుకులు మార్చే సీఎం కేసీఆర్ కు మద్దతు ఇద్దామా?
- దళిత సోదరులు సమిష్టిగా పనిచేసి రేగా ని గెలిపించాలి
- పినపాక నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్
మన్యం న్యూస్ గుండాల: పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ను గెలిపిస్తే పినపాక నియోజకవర్గాన్ని దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ అన్నారు.బీ ఆర్ ఎస్ దళిత నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారి మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. గురువారం ఆళ్లపల్లి, మర్కోడు పంచాయతీలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పినపాక నియోజకవర్గం లో పర్యటించినప్పుడు నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఎన్నికలు అయిపోయిన అనంతరం ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత రేగా కాంతారావు చూసుకోనున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న తరుణంలో దళిత సమాజం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ ఎస్టీ సెల్ జిల్లా నాయకులు వట్టం రాంబాబు ,మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా,ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకన్న, ఎస్సి సెల్ అధ్యక్షులు రాంబాబు, సర్పంచ్ శంకర్ బాబు, తాళ్లపల్లి రవి, బోయిల్ల రాజు, వ్యాసారపు బాబు, వల్లే పోగు రాము, శశి, సమంత తదితరులు పాల్గొన్నారు.