మన్యం న్యూస్,కారేపల్లి:
మాయమాటలతో మోస పూరిత చేష్టలకు మోసపోవద్దని వైరా బీఆర్‌ఎస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అన్నారు.గురువారం కారేపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.పాటిమీదిగుంపులోని రామాలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించిన బానోత్ మదన్‌లాల్ మండలంలో అనేక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలిశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. వచ్చేది… జనం మెచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వానినే అని అన్నారు.ప్రతి కుటుంబం ప్రభుత్వం సంక్షేమ పధకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ దన్నారు.కాంగ్రెస్ ప్రగతి నిరోధక శక్తి అని ఆ పార్టీ నాయకుల ప్రలోభాలకు ప్రజలు లోనుకావద్దని కోరారు.కాంగ్రెస్ 6 గ్యారంటీలంటూ భ్రమలు కల్పిస్తుందని,గ్యారంటీ మాటలను నమ్మేస్ధితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించటం ద్వారా కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్,ఎంపీపీ మాలోత్ శకుంతలకిషోర్,జడ్పీటీసీ వాంకుడోత్ జగన్,వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేందర్.సంత ఆలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య,సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్,మర్సకట్ల రోషయ్య,ప్రముఖన్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు,సర్పంచులు బానోతు శంకర్, మాలోత్ కిషోర్,భూక్యా రమణ,అజ్మీర నాగేశ్వరరావు, మండల కోఆప్షన్ ఎండీ.హనీఫ్,నాయకులు తోటకూరి పిచ్చయ్య, హన్మకొండ రమేష్,గౌసుద్దీన్,గౌస్‌పాషా,గడ్డం వెంకటేశ్వర్లు,హచ్చు తదితరులు పాల్గొన్నారు.