మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని రామానుజవరం గ్రామ పంచాయతీ నందు బొడ్డు పల్లి కోమరమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని రేగా సుధారాణి వారి స్వగృహానికి వెళ్లి,వారి అరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకున్నారు.వారికి అన్నీ వేళలా అండగా ఉంటామని బరోసా కల్పించారు.అనంతరం కొట్టే రాములు కోడలు అనారోగ్యం తో మరణించగా వారి నీవాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.