మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి జిల్లాకు అదనంగా కేటాయించిన 160 బ్యాలెట్ యూనిట్లును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల శుక్రవారం రాత్రి పరిశీలించారు. జిల్లాకు చేరుకున్న బ్యాలెట్
యూనిట్లును ఈవిఎం గోదాంలో పటిష్ట భద్రత మధ్య భద్ర పరిచినట్లు చెప్పారు. ఈసిఐఎల్ నుండి జిల్లాకు అదనంగా కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం ర్యాన్డమైజేషన్ ప్రక్రియ నిర్వహించి
నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ శిరీష, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, రంగ ప్రసాద్, బిజెపి నుండి లక్ష్మణ్ అగర్వాల్, బీఎస్ నుండి మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.