UPDATES  

 బిఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ విస్తృత ప్రచారం..ఉప్పొంగిన ప్రజాభిమానం.

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, నవంబర్ 17, వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ మండలంలో శుక్రవారం విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిరాం తండా లో ప్రారంభమైన ఎన్నికల ప్రచార కార్యక్రమం పడమట నర్సాపురం, మాచినేని పేట తండా, కొమ్ముగూడెం, కరివారి గూడెం, చింతలతండా, లోన మాచినపేట, గురువాగుతండా, కాకర్ల గ్రామ పంచాయతీలలో కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఉప్పొంగిన అభిమానంతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని, మదన్ లాల్ కు ఘన స్వాగతం పలికారు. డప్పువాయిద్యాలు, డీజే ఆట పాటలతో ప్రచారం హోరెత్తింది. ఈ సందర్భంగా మదన్ లాల్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలన గురించి వివరించారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని, పార్టీ అభ్యర్థులమైన మమ్ములను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని, అన్ని రంగాలలో వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, రైతుబంధు సమితి అధ్యక్షుడు వీరభద్రం, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి లాకావత్ గిరిబాబు, బిఆర్ఎస్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, చెరుకుమల్ల రుక్కయ్య, చావా వెంకటరామారావు, మూడు చిట్టిబాబు, పోలుదాసు కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ వెంకన్న, నర్సాపురం సర్పంచ్ కట్రం మోహనరావు, నాగ శ్రీనివాసరావు, బాదావత్ వెంకట్రాం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !