మన్యం న్యూస్,భూర్గంపాడ్:
మండల వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అభివృద్ధి పనులను యుద్ధప్రతిపదికన పరుగులు పెట్టించి పూర్తి చేయడంలో విప్ రేగా కాంతారావు విజయం సాధించారని, మండల అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ ని ప్రజలు గెలిపించుకోవాలని బూర్గంపాడు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ అన్నారు. శుక్రవారం సారపాక పంచాయతీలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపును కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలోని ప్రజలతో మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా రేగా కాంతారావు ప్రజలకు కావలసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వంతో చర్చలు జరిపి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. వరదల సమయంలో బూర్గంపాడు మండల ప్రజల అవస్థలను చూడలేక బూర్గంపాడు మండలం పై ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి సారించి సిసి రోడ్లను, డ్రైనేజీలను, కరెంటు, మంచినీటి సౌకర్యం వంటి సమస్యలను చాలెంజింగ్ గా తీసుకొని పూర్తి చేసేందుకు ఎనలేని కృషి చేశారని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే రేగా ఆదేశాల మేరకు స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సైతం అనునిత్యం ప్రజల కోసం అనే కార్యక్రమంతో సుమారు మూడు వారాల మూడు వారాలపాటు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని హుటాహుటిన ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా పినపాక బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించండి… దళిత బందును పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి అమలు చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని దళితవాడల్లో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, సారపాక యూత్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిబాబు, జినూగు దాసు, సంజీవ్, సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు.