- పాయం …ఖబర్దార్
- ప్రజలు కష్టాలలో ఉంటే… పాయం ఏసి రూమ్ లో పడుకున్నాడు
- రేగాని ఓడించాలని కాంగ్రెస్ జాతీయ నాయకులు మణుగూరు రాక
- నాలుగు సార్లు పార్టీ మారిన పాయం నాన్నా విమర్శించేది?
- కరోనా వరదల సమయంలో ఏసీ గదిలో పడుకున్నావు
- సర్వేనెంబర్ 134 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టింది నీవు కదా
- జాతీయ నాయకుల ఒక్క సైగతో నోరుమూసిన పాయం
- నీలాంటి అసమర్థుడు ఈ నియోజకవర్గానికి అవసరమా?
- రూ.11 కోట్ల తో పాయం ఇంటి ముందు రహదారి అభివృద్ధి
- అనిశెట్టి పెళ్లి నుండి ఆళ్ల పెళ్లి వరకు డబల్ రోడ్డు నిర్మాణం
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (ఆళ్లపల్లి): కరోనా మహమ్మారి, గోదావరి వరదల సమయంలో పినపాక నియోజకవర్గం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దినదిన గండం గా గడుపుతుంటే… పినపాక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు బిర్యానీలు తింటూ ఏసీ రూమ్లో పడుకున్నాడని విప్, పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్ల పళ్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. అనునిత్యం పినపాక నియోజకవర్గం అభివృద్ధికి తపించే ఆదివాసి నాయకుడిని అయినా తనను ఓడించాలని కక్షతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీని మణుగూరుకు పిలిపించుకున్నారని అన్నారు. పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాలను మైదాన ప్రాంతాలకు ధీటుగా అభివృద్ధి చేశానని అన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలపై పోరాటం చేశానని, మణుగూరు లో జరిగిన సమావేశంలో ఒక్క సైగ తో నోరుమూసిన పాయం కావాలా, ప్రజా సమస్యలపై కొట్లాడి సాధించే రేగ కాంతారావు కావాలా? ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయం వెంకటేశ్వర్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మణుగూరు మండలం సంతసింగారంలోని సర్వేనెంబర్ 134 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టింది పాయం కాదా అని ప్రశ్నించారు. రేగా కాంతారావు తలుచుకుంటే బుల్డోజర్ తో పాయం ఇల్లు కూల్చి వేయించేవాడినని అన్నారు. భయం అసత్య ఆరోపణలు ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల హామీలో భాగంగా అని శెట్టి పెళ్లి నుండి ఆళ్ల పళ్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గౌడన్న లకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తానని అన్నారు. నవంబర్ 30న అల్లపల్లి మండల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. అభివృద్ధి కుంటుపడాల? కొనసాగాల? ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు