మన్యం న్యూస్, మంగపేట :
ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, కాంగ్రెస్ బి.జె.పి పార్టీలను ప్రజలేతరిమికొడుతారు అని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో గెలిపించి బ్రహ్మరథం పడతారు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మెట్టు శ్రీనివాస్ అన్నారు.
మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని లక్ష్మీ బృందావనం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
దశాబ్దాల కలను సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. అలాగే గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి మిషన్ భగీరద ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరుఅందించడం జరిగిందని, పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. ములుగు నియోజకవర్గంలో ఇవన్నీ చేసిన
కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులుఅనుచిత వాక్యాలు మాట్లాడుతున్నారు
రేపు జరగబోయే ములుగు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలే వారి ఓటుతో బుద్ధి చెబుతారు అని అన్నారు.
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాబోతున్నారని జోష్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు క్లస్టర్ ఇన్చార్జిలో ములుగు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు సీనియర్ నాయకులు ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.