- ఏడూళ్ల బయ్యారం లో రేగా రోడ్ షో అదుర్స్
- ఉప్పాక బ్రిడ్జి నుండి బయ్యారం వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
- అడుగడుగునా జననీరాజనం
- జోష్ లో బీ ఆర్ ఎస్ శ్రేణులు
మన్యం న్యూస్,పినపాక:మండల పరిధి ఏడూళ్ల బయ్యారంలో నిర్వహించిన బీ.ఆర్.ఎస్ రోడ్ షో సోమవారం అదుర్స్ అనేలా నిర్వహించారు. తొలుత ఉప్పాక బ్రిడ్జి నుండి ఈ.బయ్యారం వరకు బీ ఆర్ ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రోడ్ షో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు రక్షణ అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పాటు పినపాక నియోజకవర్గం లో భారీ మెజార్టీతో గులాబీ జెండా ను ఎగుర వెయ్యబోతున్నాం అని ఆయన తెలిపారు, ఈనెల 30 తేదీన జరగను ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు..