మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్,మణుగూరు మండల అధ్యక్షులు గురజాల గోపి,ఇల్లందు కాంగ్రెస్ ఎన్నికల కోఆర్డినేటర్ అశ్వాపురం ఎంపీటీసీ పోరెడ్డి విజయలక్ష్మి, మణుగూరు ఎస్టీ సెల్ అధ్యక్షులు కిషన్ నాయక్, కొండబాబు లక్ష్మయ్య,కొరివి శేఖర్,కృష్ణవంశీ తోపాటు సుమారు 1500 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువా లు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమం పథకాలు, బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పై నమ్మకం పెరిగిందన్నారు. రోజురోజుకు బిఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని వారు తెలిపారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.గెలుపే లక్ష్యంగా అందరూ కలసికట్టుగా,పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ సీనియర్ నాయకులు, అశ్వాపురం ఎంపీటీసీ విజయలక్ష్మి,గ్రామ అధ్యక్షులు లక్ష్మయ్య,ఎస్టీ సెల్ నాయకులు
కిషన్ నాయక్,కమలాపురం గ్రామ సెక్రటరీ కొండాబాబు, యూత్ లీడర్ కొరివి శేఖర్
బుర్ల సతీష్,సత్యనారాయణ.
కళ్యాణ్,కృష్ణ వంశీ,బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, టిఆర్ఎస్వి నాయకులు ముఖ్య కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.