మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: బూర్గంపహాడ్ మండలం బూర్గంపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో టి ఎస్ ఆర్ జె సి పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ తాతారావు ఆధ్వర్యంలో ఐటిసి ఎమ్మెస్ కే వాష్ ప్రోగ్రాం సహకారంతో వరల్డ్ టాయిలెట్ డే వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వాష్ ప్రోగ్రాం సిబ్బంది మాట్లాడుతూ అందరూ కచ్చితంగా మరుగుదొడ్లని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. మరుగుదొడ్ల ఉపయోగాన్ని ,వినియోగం గురించి వివరించారు.విద్యార్థినిలకు టాయిలెట్ డే సందర్భంగా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం . ప్రిన్సిపాల్ తాతారావు మాట్లాడుతూ టాయిలెట్ డే కార్యక్రమాన్ని మా క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని,విద్యార్థినీలు అందరూ వాష్ ప్రోగ్రాం వారు చెప్పినటువంటి విషయాలను పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలోప్రిన్సిపల్ తాతారావు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయనులు ఎమ్మెస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుచిత్ర,వాష్ ప్రోగ్రాం పిఓ విజయ్,వాష్ ప్రోగ్రామ్ సిబ్బంది సునీల్ ,వెంకటేశ్వర్లు ,వెంకట్రావు,ముత్యాలరావు ప్రమోద్ ప్రసాదు జంపరాజు అపర్ణ ,వెంకటేశ్వర్లు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.