- బరితెగించిన మట్టి మాఫియా
- ఏదేచ్ఛగా మట్టి తవ్వకాలు
- ప్రశ్నించిన విలేకరిపై కేసులు పెడుతున్న వైనం
- తాము ఏమీ చేయలేమంటూ
- చేతులెత్తేసిన మండల రెవెన్యూ అధికారి
మన్యం న్యూస్ నూగూరు వెంకటాపురం
మండల కేంద్రంలో శివాలయం మల్లాపురం వెళ్లే మార్గంలోమట్టి తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
అక్రమంగా మట్టి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న బెస్త గూడానికి చెందిన ఒక మట్టి తిమింగలం
మట్టి తవ్వకాలు జరుపుతుండగా కవరేజ్ కి వెళ్ళిన విలేకరులపై దుర్భాషలాడటంతో పాటు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
గత నెల రోజులుగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసే అధికారి లేకపోవడం చర్చనియాంశంగా మారింది.
ఈ విషయం పట్ల సదరు మండల రెవెన్యూ అధికారిని వివరణ కోరగా తనపై పలువురి ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ మట్టితోలకాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.