- తెలంగాణకు సీఎం కేసీఆర్ యే శ్రీరామరక్ష
- బిఆర్ఎస్ లో భారీగా చేరికలు
- రేగాకు అండగా నిలుస్తున్న ప్రజలు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో కూనవరం గ్రామ పంచాయతీ పరిధి లోని బొంబాయి కాలనీ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు మహేష్, సీతారామరాజు,వంశీ,శ్రీధర్, నాగరాజు,వినోద్,విజయ్ పలు కుటుంబాలు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు.పేద, మధ్యతరగతి ప్రజల కోసం బిఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు.పినపాక నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.పాపారావు,సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, వట్టం రాంబాబు,నూకారపు రమేష్,కీసర శ్రీనివాసరెడ్డి,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.