UPDATES  

 రేగాతోనే మా ప్రయాణం ..బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యం..

 

మన్యం న్యూస్ మణుగూరు:

 

మణుగూరు మండలంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉద్యమకారుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు ఎడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రేగా కాంతారావు గెలుపు కోసం ఏకపక్షంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు.నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ను ఇచ్చింది అనుకోవడం హాస్యాస్పదం అన్నారు.నాడు కనికరం లేకుండా జనాలను చంపి,నేడు జోహార్లు అంటున్న కాంగ్రెస్ వాళ్లను చూస్తే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది అన్నారు.ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకొని కేసీఆర్ నాయకత్వం లో స్వరాష్ట్ర సాధనలో సకల జనులు ఏకమై సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం నేడు సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగాముగా నిలిచిందన్నారు. పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను తెలంగాణ ఉద్యమకారులు అందరూ బలపరుస్తూ ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజా కాంతారావు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పొనుగంటి కిషన్ రావు,లాయర్ డాక్టర్. సమ్మయ్య,కత్తి రాము, మౌలానా,వాంకుడోత్ రెడ్డి,లక్ష్మి, పాకాల రమాదేవి,చంద్రకళ, రెహనా ఖాదర్,ఎన్ ఎన్ రాజు, పవన్ నాయక్,ప్రతాప్,తురక రామకోటి,సుమారు మారు 60 మంది ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !