UPDATES  

 ఎన్నికల నిర్వహణకు సిబ్బంది రెడీ…ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో

పోలింగ్ నిర్వహణకు విధులు నిర్వహించు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి సన్నద్ధంగా ఉంచినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో

కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకు శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు

గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఈవిఎంలు కమిషనింగ్, ఇంటి

నుంచి ఓటుహక్కు సేకరణ పోలింగ్ సిబ్బందికి శిక్షణ రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ జిల్లాలో 1098 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 966439 ఓటర్లలో బుధవారం 892352 మంది ఓటర్లుకు ఓటర్ సమాచార

స్లిప్పులు పంపిణీ చేశామని, 74087 మంది ఓటర్లకు గురువారం నాటికి ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాలో 1 లక్షా 18 వేల 990 మందికి ఎపిక్ కార్డులు జారీ చేయాల్సి ఉండగా 101876

కార్డులు పంపిణీ చేశామని, 17114 కార్డులు రానున్న మూడు రోజుల్లో పంపిణీ చేయు విధంగా చర్యలు తీసుకుంటామని

చెప్పారు. ఎపిక్ కార్డులు త్వరితగతిన పంపిణీ చేసేందుకు అదనపు బూత్ స్థాయి అధికారుల బృందాలను ఏర్పాటు

చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఇల్లందు, పినపాక కొత్తగూడెం నియోజక వర్గాల పరిధిలో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామని, రెండవ బ్యాలెట్ యూనిట్ ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, ఈవిఎం యంత్రాల

కమిషనింగ్ ప్రక్రియ శుక్రవారం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో దివ్యాంగులు,

80 ఏండ్లు పైబడిన వయో

వృద్ధులకు ఇంటి నుంచి ఓటుహక్కు వినియోగానికి 725 మంది దరఖాస్తు చేసుకోవగా 21వ తేదీ నుండి

ప్రారంభించామని బుధవారం వరకు 646 మంది వినియోగించుకున్నారని మిగిలిన 7925వ తేదీ వరకు పూర్తి

చేస్తామని చెప్పారు. హెూం ఓటింగ్ నిర్వహణకు పినపాకలో 13, ఇల్లందులో 5, కొత్తగూడెంలో 5, అశ్వారావుపేటలో

7, భద్రాచలంలో 5 మొత్తం 35 బృంధాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఓటు హక్కు కల్పించేందుకు నవంబర్ 25 నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు

ఏర్పాటు ద్వారా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ నిర్వహణకు

అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ఐదు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం

రాజకీయ నాయకులు నిర్వహించే సభలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటివరకు జిల్లాలో 24 ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేయడం జరిగిందని

చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి నిబంధనలు పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్

తెలిపారు. అంతకు ముందు ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్

పరిశీలించారు. చెక్ పోస్టులు వద్ద

వాహనాలు తనిఖీ ప్రక్రియను పరిశీలించి, రిటర్నింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వెబ్ కాస్టింగ్

నోడల్ అధికారి సులోచనారాణి, ఎన్నికల తహసిల్దార్ దారా ప్రసాద్ తదితరులు

పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !