UPDATES  

 తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా..

  • తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా
  • అభివృద్ధిని చూసి ఓటు వేయండి..గులాబి జెండా అన్ని వర్గాలకు అండ..అడుగడుగున రేగాకు ప్రజలు బ్రహ్మరథం నాడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ?నేడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. ప్రజలు ఆలోచన చేయాలిబీ ఆర్ ఎస్ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు

మన్యం న్యూస్, అశ్వాపురం: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని పినపాక నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు.ఆయన బుధవారం మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కళ్యాణపురం,మిట్టగూడెం, పిచుకల తండా, పాయం మంగయ్య గారి గుంపు, పాములపల్లి, బట్టీల గుంపు, బట్ట మల్లయ్య గుంపు, అను శక్తి నగర్, సుందరయ్య గుంపు, పాములపల్లి ఎస్టి కాలనీ, అమ్మగారిపల్లి, అను శక్తి నగర్, కుమ్మరిగూడెం, జగ్గారం, జగ్గారం ఎస్సీ కాలనీ, మంచి కంటి నగర్ , అమేర్ధ, సండ్రల బోడు , చింతిర్యాల గూడెం,చింతిర్యాల కాలనీ,చింతిర్యాల, కట్టంవారిగూడెం,గొల్లగూడెం గ్రామాలలో పాల్గొన్నారు.తొలిత స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో వారికి ఘన స్వాగతం పలికారు.పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని అభివృద్ధి సంక్షేమని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5016కు, దివ్యాంగులకు పెన్షన్ 6 వేలకు పెంచుతామన్నారు.సమాఖ్యలకు సొంత భవనాలు అర్హులైన పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు.30వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని తెచ్చి పది లక్షల రూపాయలు అందజేస్తున్నారని చెప్పారు.ఎన్నికలు పూర్తికాగానే హుజురాబాద్ తరహాలో పినపాక నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కచ్చితంగా ఇస్తామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీటీసీలు కందుల దుర్గ భవాని,తాటి పూజిత,పో రెడ్డి విజయలక్ష్మి,సర్పంచులు,ఉప సర్పంచ్లు,వార్డు మెంబర్లు,మండల అధ్యక్షులు కోడి అమరేందర్,సీనియర్ నాయకులుకందుల కృష్ణార్జునరావ్,సూది రెడ్డి గోపిరెడ్డి,జాలే రామకృష్ణారెడ్డి,గజ్జల లక్ష్మారెడ్డి,మర్రి మల్లారెడ్డి,తోకల లత,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,సీనియర్ నాయకులు,మండల నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు అభిమానులు ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !