UPDATES  

 పోస్టల్ బ్యాలెట్ కు ఏర్పాట్లు పూర్తి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

ఫెసిలిటేషన్ కేంద్రాల్లో సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల రిటర్నింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుండి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటుపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ విధులు

నిర్వహించు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఆయా

నియోజకవర్గాలలో ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న

ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్స్ వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మన జిల్లా నుండి ఇతర

జిల్లాలకు 3575, ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు 1410 మంది పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లు చెప్పారు. పోస్టల్

బ్యాలెట్లు వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, మంగీలాల్, శిరీష, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

*భారీ బందోబస్తు నడుమ ఓటింగ్ ప్రక్రియ..*

భారీ బందోబస్తు నడుమ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో సాధారణ పరిశీలకులు కమల్ కిషోర్, గణేష్, హరికిషోర్, వ్యయ పరిశీలకులు అజయాల్ చంద్ సోనేజి, సంజీబ్కుమార్పాల్, పోలీస్ పరిశీలకులు స్వపన సర్కార్ తో పోలింగ్ లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతరాష్ట్ర చెక్పోస్టుల్లో పటిష్ట బందోబస్తు కొనసాగించాలని చెప్పారు. నియోజకవర్గాల వారిగా డిస్ట్రిబ్యూషన్,

రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, స్ట్రాంగు రూము వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుపై చర్చించారు. ప్రత్యేక బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా

ఓటుహక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ఛైర్లు ఏర్పాటు బాధ్యతలను

కార్యదర్శులకు అప్పగించినట్లు చెప్పారు. ఓటరు స్లిప్పులు పంపిణీతో పాటు ఎన్నికల్లో అక్రమాలు నియంత్రణకు

ప్రజలు ఏ విధంగా పిర్యాదు చేయాలో తెలియచేయు సి విజిల్ యాప్ యొక్క కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు

చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !