మన్యం న్యూస్, మంగపేట
మండలం లో బుధవారం మండల పార్టీ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం ఆధ్వర్యంలో వడ్డెర కులస్తులు సుమారు 100మంది, బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన పలువురు బి ఆర్ ఎస్ సంక్షేమ పథకాలు నచ్చి బీ ఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారిని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి పార్టీలోకీ ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు,60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడిందన్నారు, మతం పేరుతో బిజెపి రాజకీయం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు,అందరి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం అని తెలియజేశారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రశ్నించ వలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే మళ్ళి కేసీఆర్ సీఎం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.