- పోడు పట్టాలు ఇప్పించిన ఘనత రేగాది
- పోడు రైతుల గోడు పట్టని పాయం
- పోడు పట్టాలపై పాయం మాట్లాడడం హాస్యాస్పదం
- పాయం వెంకటేశ్వర్లు పోడు పట్టాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
- బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్
మన్యం న్యూస్ గుండాల: బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోడు రైతుల గోడు చూడలేక పోడు పట్టాలను అందిస్తే గుండాల మండలానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పోడు పట్టాలు చిత్తు కాయితాలతో సమానం అంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సరైంది అని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోడుగోడు పట్టని పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై తప్పుడు ఆరోపణలు ఎంతవరకు సరైందని అన్నారు. గతంలో తాను ఉన్నప్పుడు బీఆర్ఎస్ పథకాలు గొప్పగా అని చెప్పిన తానే నేడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆరోపణలు చేయడం ప్రజలు గమనించాలని అన్నారు. గ్రామంలో 25 కుటుంబాలు ఉంటే వాళ్లని ఏ పార్టీకి సంబంధమో తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కండవల కప్పి షో చేశారే తప్ప తాను కొత్తగా సాధించిందేమీ లేదని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే పెద్దతోగు గ్రామానికి వెళ్లి హామీలు కురిపించి మరల ఈ ఎన్నికలకు ఆ ఊరు వెళ్ళాడు తప్ప గతంలో వాళ్లు ఎన్ని బాధలు పడ్డ తన కంటికి కనపడలేవా అని అన్నారు. పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రేగా కాంతారావు పెద్దతోగు గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఐదున్నర కోట్లతో రహదారిని మంజూరు చేయించి టెండర్‌ను పూర్తి చేయించారని అన్నారు. పెద్ద తోగు గ్రామ సమీపంలో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన కోసం 8 కోట్ల రూపాయలను మంజూరు చేయించిన ఘనత రేగా కాంతారావు కె దక్కుతుందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని పనులన్నీటిని ఇప్పుడు గెలిపిస్తే చేస్తానంటే ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అభివృద్ధి జరగాలంటే రేగ కాంతారావే మళ్లీ గెలవాలని పాయం వెంకటేశ్వర్లు గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందని అన్నారు. వెన్నెల బైలు గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ట్రంచ్ కొడుతున్నారని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు కు ఫోన్ చేసి ఆపాలని విన్నవించుకున్నప్పటికీ అది మన చేతిలో లేదు ఏమి చేయలేము అక్కడి నుండి తిరిగి రావాలని మమ్ములను పిలిపించిన పాయం వెంకటేశ్వర్లు లేడు రాష్ట్ర ప్రభుత్వం రేగా కాంతారావు తర్వాత వచ్చిన పోడు పట్టాలను చిత్తుకాయితాలతో పోల్చడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న పాయం వెంకటేశ్వర్ల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్న రేగా కాంతారావు గారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి తిరువల్లూరి రాము, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, దొంగతోగు ఉప సర్పంచ్ పాపారావు, పార్టీ నాయకులు రాంబాబు, జోగ రాంబాబు, గాంధర్ల కిరణ్, జాటోత్ అమృ, తదితరులు పాల్గొన్నారు.