మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరం, దోసిల్లపల్లీ,ముసిలేరు, గొమ్ముగూడెం గ్రామంలో భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి తెల్లం వెంకట్రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, రైతులకు చేసే అభివృద్ధి నచ్చి ఆ పార్టీలో దేవనగరం గ్రామంలోనీ 50 కుటుంబాలు, దోసిల్లపల్లి లోని 100 కుటుంబాలు వెంకట్రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గొమ్ముగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పొడియం మురళి, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోట్రు బ్రహ్మానందరెడ్డి, అధ్యక్షతన భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలందరినీ తెల్లం వెంకట్రావు గెలుపు కోసం రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెడతారని అన్నారు. గత ఎన్నికలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వలసవాది ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని నియోజకవర్గంలో ఎన్నో కీలకమైన సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించాడు.నేను స్థానిక నివాసిని,నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, రేపు రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీనే కావున ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోయం రాజారావు, కార్యదర్శి లంకరాజ,కాపుల కృష్ణ, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు కాకి అనిల్,ఈశ్వర్, వినోద్, బాలు, అరుణ్,కాపుల నాగరాజు,అజీజు,దొడ్డి తాతారావు, ఆవుల మదన్ మోహన్ రెడ్డి, దినసరపు భాస్కర్ రెడ్డి, మోట్లా వెంకటేశ్వర్లు, సంక పాప. ప్రభాకర్ రావు, గాదె భద్రయ్య సొంత పూరి సతీష్, ఆవుల రమణ, కోనూరి రమణ, సుంకరి జెయ, చీమిడి మహాలక్ష్మి, పూజారి రమణ, పంజా రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.