మన్యం న్యూస్,అశ్వాపురం:
మండలం లోని మిట్టగూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ముఖ్య అనుచరుడు సొంత బామ్మర్ది కూరపాటి చలపతి బిఆర్ఎస్ లో చేరారు .ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత కల్పిస్తా అని అన్నారు.