మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావును గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు మోరే భాస్కర్ తొగరు రాజశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం జింకల గూడెం గ్రామంలో ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జింకల గూడెం మరింత అభివృద్ధి కావాలంటే
రేగా కాంతారావు కారు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులకు అందించడం జరిగిందని వివరించారు. అభివృద్ధి పథకాలు పూర్తిగా కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్న పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు గెలవాలన్న జింకల గూడెం గ్రామస్తులు కారు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.