UPDATES  

 వనమా గెలుపు అభివృద్ధికి మలుపు..

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేయడమే తప్ప ఏనాడు మోసపూరితపు మాయమాటలు చెప్పలేదని తనను ఆదరించి గెలిపించిన ప్రజల కోసం పనిచేశానని కొత్తగూడెం ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా తనను ఆదరించి ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీ, హమాలీ కాలనీ, వనమా కాలనీ, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, శివానగర్, దమ్మపేట సెంటర్, అయ్యప్ప నగర్, నెహ్రూ నగర్, బాలాజీ నగర్, వెంకటేశ్వర హిల్స్ కాలనీ, కాంట్రాక్టర్స్ కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సభల్లో కొత్తగూడెం నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణలు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల తోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ప్రజలు ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతున్నారని అన్నారు. ఆ పథకాలు ప్రతి ఇంటికి రావాలి అంటే తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావు గెలవాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో

బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !