మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో ఈవీఎం యంత్రాల రాండమైజేషన్ ప్రక్రియ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పినపాక నియోజకవర్గ అబ్జర్వర్ హరి కిషోర్ సమక్షంలో నిర్వహించడం జరిగింది అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు.అనంతరం మణుగూరు డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది శిక్షణ శిబిరాన్ని వారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈవీఎంల పై అవగాహన కల్పిస్తూ, పలు సూచనలు చేశారు.ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా,ఎన్నికలు సజావుగా జరిపించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు.ఎన్నికల సిబ్బంది శిక్షణకు వచ్చిన వారందరితో రాజకీయ పార్టీల ముందు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.