మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల,పట్టణ పరిధి లో గురువారం నాడు
ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఈ ప్రచార కార్యక్రమం ఉదయం 7 గంటలకు రాజుపేట గ్రామంలో నుండి మొదలవుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,బిఆర్ఎస్ పార్టీ అభిమానులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరారు.