UPDATES  

 అక్రమ సంపాదనలో కల్వకుంట్ల కుటుంబం..అవినీతి పరులను సాగనంపాలి.

  • అక్రమ సంపాదనలో కల్వకుంట్ల కుటుంబం
  •  అవినీతి పరులను సాగనంపాలి
  •  కాంగ్రెస్ తోనే సుభిక్ష పాలన
  •  కూనంనేని గెలిపించండి
  • ఎన్నికల ప్రచారంలో చాడ

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:

కాంగ్రెన ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని, జరగబోయే ఎన్నికల్లో అవినీతి పరులను సాగనంపేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. గురువారం పాల్వంచ మండల పరిధిలోని కరకగూడెం, గుట్టాయిగూడెం, ఒడ్డుగూడెంతో పాటు తదితర గ్రామాల్లో కాంగ్రెస్, సిపిఎం, టిజేఎస్, టిడిపి, ప్రజావంధ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన చాడా మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలన సాగిందని, అందినకాడిగి కాజేసి ఫాం హౌస్లో దాచుకుని ఎన్నికల్లో దోచుకుని దాచుకున్న డబ్బులను వెదజల్లుతున్నారని, ఓట్లకు నోట్ల ఆశ చూపి ఎన్నికల్లో గెలిచేందుకు జిత్తులు మారి ప్రయత్నాలుచేస్తున్నారని అన్నారు. గత పాలనలో బిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నేరవేర్చక పోగా కొత్తకొత్త హామీలతో మరో సారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ఓటర్లు జాగ్రత్తగా మసులుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే

ప్రజారాజ్యం ఏర్పడుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలుచేసే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టి అమలు చేయబోతోందని చెప్పారు. పేదల కోసం ఆలోచించే పాలకులను ఎన్నుకుంటే బాగుటుందని చెప్పారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు బలపరిచిన సిపిఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు ఎన్నికల గుర్తు కంకి కొడవలికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే మాయగాళ్లు డబ్బు సంచులతో తిరుగుతున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకొస్తారని, ఎన్నికలు అయిపోయిన తర్వాతా పత్తా లేకుండా పోతారని చెప్పారు. స్వార్థ రాజకీయాలు చేసే స్వార్థ పరులను పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి సంక్షేమ కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని కోరారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకర్గంలో ఎన్నడూ లేని ప్రజా సంక్షేమ పాలన సాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతీ పథకాన్ని అర్హులైన వారి గడవకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, టిజేఏస్, ప్రజాచంథా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

*కూనంనేనికి ముస్లిం సంఘాల మద్దతు…*

జమా అతే ఇస్లామిక్ హింద్ నంఘాల మద్దతు ఎమ్మెల్యే అభ్యర్ధిగా భరిలో ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు జమా అతే ఇస్లామిక్ హింద్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూనంనేని, పాషా మాట్లాడారు. రాబోయే కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, ముస్లీం సోదరులు దృష్టి సారించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !