- ఏడూళ్ల బయ్యారం లో రేగా పై కాంగ్రెస్ గుండాల దాడి
- పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పై దాడి ,కార్ పై కూడ రాళ్ల దాడి
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు
- జిల్లా ఎస్పీ ఆదేశించిన
- సకాలంలో స్పందించని ఎస్సై
- కాంగ్రెస్ అల్లరి ముక ను చెదరగొట్టిన డి.ఎస్.పి
- ఆదివాసీ ప్రజా ప్రతినిధి అంటే అంత చులకన:విప్ రేగా
- ట్రైని ఎస్సై, సిఆర్పిఎఫ్ సిబ్బందిపై ఏడూళ్ల బయ్యారంలో ఫిర్యాదు చేసిన రేగ
మన్యం న్యూస్,పినపాక: ఏడుల బయ్యారం లో గురువారం పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. అలాగే ఆయన కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ పరిశీలనకు బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు వెళ్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ గుండాలు అప్పటికే అక్కడ మాటు వేసి ఉండి కొంతమంది మహిళలను ఉసిగొల్పి రేగాను అడ్డుకున్నారు. సిఆర్పిఎఫ్ సిబ్బంది సైతం రేగా కాంతారావు పైకి లాఠీ ని లేపారు. దీనితో షాక్ కు గురైన రేగా కాంతారావు తాను ఎమ్మెల్యే అభ్యర్థిని, పోలింగ్ బూత్ కెళ్ళే హక్కు ఉంటుందని తెలిపిన సిఆర్పిఎఫ్ సిబ్బంది రేగాను అడ్డుకున్నారు. వెంటనే జిల్లా ఎస్పీకి రేగా కాంతారావు ఫోన్ లో సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్పీ ట్రైనీ ఎస్సై సతీష్ ను పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ఆదేశించినప్పటికీ ఎస్పీ మాటలను బేకాతరు చేస్తూ ఎస్ఐ సతీష్ సైతం రేగాను అడ్డుకున్నారు. దీనితో కోపాద్రిక్తుడుఐన రేగా కాంతారావు ఎస్సై తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితినికాంగ్రెస్ అల్లరి ముక ను చెదరగొట్టారు. విధినిర్వహణలో అజాగ్రత్తగా ఉన్న ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తనపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై, తనను అడ్డుకున్న ట్రైన్ ఎస్సై, సిఆర్పిఎఫ్ సిబ్బందిపై ఏడుల బయ్యారం పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు ఫిర్యాదు చేశారు.