UPDATES  

 కూనంనేని గెలుపు ఖాయం.. గెలుపుకై కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు…

 

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

కొత్తగూడెం అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పొత్తుతో దిగిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు ఖాయమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించడం తన గుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ పార్టీ అభ్యర్థిగా భావించి సిపిఐ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షించి గత కొన్ని రోజులుగా పొత్తుల ఉన్న పార్టీల సమన్వయంతో పనిచేసి సిపిఐ అభ్యర్థి విజయాన్ని సాధించే దిశగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కొత్తగూడెంలో సిపిఐ పార్టీ అభ్యర్థి కూడా అత్యధిక మెజారిటీతో

గెలవ బోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, డాక్టర్ శంకర్ నాయక్,

దేవి ప్రసన్న, గిడ్ల పరంజ్యోతి, రాజ్యలక్ష్మి, పౌలు, శివప్రసాద్, పెద్దబాబు, చిన్ని, సుందర్ లాల్ కోరి, బలప్రసాద్ పాసి, పాల సత్యనారాయణ రెడ్డి, వనమ రాము, ఆయుబ్ ఖాన్, కనకరాజు, చంద్రశేఖర్రాం నాయక్, లక్ష్మణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !