మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శుక్రవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల పాల్వంచ బాలుర వసతి గృహానికి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్బంగ వసతి గృహం తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూమ్ లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహ ఆవరణం శుభ్రంగా లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.