మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం:
డిసెంబర్ 2 నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాలను జయప్రదం చేయాలని మంగి ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్, చర్ల సబర ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో పత్రికా ప్రకటన విడుదలయ్యాయి.పి ఎల్ జి ఏ ఏర్పడి డిసెంబర్ రెండు నాటికి 23 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారోత్సవాలను విప్లవ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలని కమిటీలు పిలుపునిచ్చాయి.గాజా ప్రజలను, పాలస్తీనా దేశాన్ని సామ్రాజ్యవాద అమెరికా ఇజ్రాయిల్ వలసదాడులో నుంచి రక్షించాలని కోరాయి. గత డిసెంబర్ నుంచి ప్రతిఘటక వ్యూహాత్మక దాడిలో అమరులైన మావోయిస్టు పార్టీ సభ్యులకు కమిటీలు జోహార్లు అర్పించాయి. సామ్రాజ్యవాద యుద్దోన్మాదం నశించాలి. ప్రపంచ కార్మికులారా ఏకంకండి, విముక్తి పోరాటాలకు మద్దతుగా పోరాడండి. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జిందాబాద్. అనే నినాదాలతో విప్లవ ప్రజలందరూ పి ఎల్ జి ఏ వారోత్సవాలను జయప్రదం చేస్తూ గెరిల్లా పోరాటాలకు తమ మద్దతును తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశాయి.