మన్యం న్యూస్ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 80.13 శాతం ఓట్లు పోల్ అయినట్టు ఎన్నికల రిటర్న్ అధికారి తెలిపారు.ఓటింగ్ లో మహిళలు 80,447 ఓట్లు వేయగా, పురుషులు 78530 ఓట్లు వేసినట్టు తెలిపారు.మొత్తం పినపాక నియోజకవర్గం లో 1,58,979 ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.