UPDATES  

 ఓట్ల లెక్కింపుకు ర్యాన్డమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు.. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంక..

 

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న శాసనసభ ఓట్లు లెక్కింపు ప్రక్రియకు విధులకు కేటాయించిన లెక్కింపు సిబ్బందిని

ర్యాన్డమైజేషన్ ద్వారా కేటాయించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో లెక్కింపు పరిశీలకులు గణేష్, వినేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో లెక్కింపు సిబ్బంది 2వ విడత ర్యాన్డమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు జరుగనున్న లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణకు ఐదుగురు పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. కొత్తగూడెంనకు కమల్ కిషోర్, ఇల్లందుకు హరి కిషోర్, అశ్వారావుపేటకు వినేశ్ కుమార్, భద్రాచలంకు గణేష్, పినపాకకు కంటి శేఖర్ సింగ్ పరిశీలకులుగా వ్యవహరించనున్నట్లు ఆమె చెప్పారు. మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం పూర్తి చేస్తామని చెప్పారు. ఓట్లు లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పినపాక 18 రౌండ్లు, ఇల్లందు 18 రౌండ్లు, కొత్తగూడెం 19, అశ్వారావుపేట 14, భద్రాచలంకు 13 రౌండ్లులో లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓట్లు లెక్కింపునకు సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు.

రౌండ్లు తదుపరి ఎన్నికల సంఘం పోర్టల్ లో టేబుల్ వారిగా అప్లోడ్ చేయాలని, అప్ లోడ్ చేయుటలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రతి రౌడ్ షీట్ లో రిటర్నింగ్ అధికారి పరిశీలకులచే ధ్రువీకరణ చేయాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని మొబైల్ ఫోన్స్ డిపాజిట్ చేసేందుకు హాలు బయట కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సిబ్బంది ఉదయం 6 గంటలకు హాజరు కావాలని చెప్పారు. ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. స్ట్రాంగ్ రూము నుండి లెక్కింపు కేంద్రంలోకి కంట్రోల్ యూనిట్లు తరలింపులో క్రమ పద్ధతి పద్దతి పాటించాలని చెప్పారు. ప్రతి రౌండ్ పర్యవేక్షణకు సెక్టార్ అధికారులను నియమించాలని చెప్పారు.

ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !