మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ఉప సర్పంచ్ ను హత్యచేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. కాంకేర్ జిల్లా చోటే బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కందాడి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రాము కచలాని ని హత్యచేశారు.రాము కచలాని పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేయడంతోనే హత్యచేసినట్టుగా మావోయిస్టులు ప్రకటించారు.