మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని రజకభళి కాలనీ లోనీ బుఠారి జోగయ్య అనే ఆదివాసి కు చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ఇల్లు ఖాళీ బూడిదయింది. సమాచారం తెలుసుకున్న సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ జవాన్లు హుటాహుటిన చేరుకొని నీటితో ఆర్పి ప్రయత్నం చేసిన అప్పటికే నష్టం వాటిల్లింది. బాధితుడికి సుమారు ఐదు లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బ్రహ్మచారి బాదిత కుటుంబాన్ని కలుసుకొని పరామర్శించారు.