మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈవిఎం అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరమ్మత్తులు నిర్వహణకు, అదనపు గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. గోదాం చుట్టుపక్కల ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ సందర్భంగా గోదాములో ఉన్న ఈవిఎం మెటీరియల్ పరిశీలించి పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో
ఆర్ అండ్ బిఈఈ భీంలా, డిఈ నాగేశ్వరరావు, ఎన్నికల విభాగం డిటి రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.