మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం మున్సిపాలిటీ పెనుబల్లి పంచాయతీ పరిధిలో గల పెనుబల్లి బ్రిడ్జి తుఫాన్ కారణంగా కృంగిపోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే గురువారం కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హుటాహుటిన సంఘటన స్థలానికి కౌన్సిలర్లతో కలిసి చేరుకొని పరిశీలించి తాత్కాలిక మరమ్మత్తులు చేయవలసిందిగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని చరవాణి ద్వారా అధికారులను కోరడం జరిగింది.
అవసరమైతే కాలినడకన మాత్రమే వెళ్లాలని బండ్లు బ్రిడ్జి పై నుండి నడపవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల ముందు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హై లెవెల్ నూతన బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగిందని దాన్ని ఇటువంటి పరిస్థితులలో వెంటనే బ్రిడ్జి పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తుఫాను తగ్గిపోలేదని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బ్రిడ్జిపై నుండి వెళ్ళవద్దని తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పరమేష్ యాదవ్ ధర్మరాజు బండి నరసింహ రుక్మేందర్ బండారి బిఆర్ఎస్ నాయకులు ఎంఏ రజాక్ యూసుఫ్ వాసు తదితరులు పాల్గొన్నారు.