జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తెచ్చిన చట్టం అమలును కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పును వెల్లడించింది. కాగా, జమ్మూ&కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.