ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజా జనాభాలో సగం మంది తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారని యూఎస్ వరల్డ్ ఫుడ్ పోగ్రామ్ (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ వెల్లడించారు. యుద్ధం కారణంగా గాజాలోని రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది.