UPDATES  

 చిరస్మరణీయం 2023..అరుదైన ఘనత..

ఇంకొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్న 2023వ సంవత్సరం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చిరస్మరణీయమైన విజయాలను అందించింది. అత్యంత అరుదైన ఘనతను ఇదే ఏడాది సొంతం చేసుకుంది. మరే దేశానికీ సాధ్యం కాని విధంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.

 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 ఉపగ్రహాలను ఈ ఏడాదే ప్రయోగించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. సంక్లిష్టమైన భూభాగం కావడం వల్ల మరే దేశం కూడా తమ ఉపగ్రహాలను ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఆ ఘనత మాత్రం భారత్‌కే దక్కింది.

 

ఈ ఏడాది జులై 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి చంద్రాయన్ 3ని ప్రయోగించింది ఇస్రో. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సహా కొన్ని కీలకమైన పరికరాలను పేలోడ్స్‌గా పంపించింది. వాటిని మోసుకెళ్లిన ల్యాండర్.. 41 రోజుల తరువాత అంటే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది.

 

అప్పటి నుంచి చంద్రుడికి సంబంధించిన కీలక డేటాను ఇస్రోకు పంపించింది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడంతో ఇక దాని పనితీరు స్తంభించిపోయింది. చంద్రుడిపై ఒక రాత్రి అంటే భూమిపై14 రోజులతో సమానం. రాత్రివేళ జాబిల్లిపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. ఇంత చలిని ఆ పేలోడ్స్ తట్టుకోలేకపోయాయి.

 

పగటి సమయం ఆరంభమైన తరువాత వాటిని యాక్టివేట్ చేయడానికి ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేసింది గానీ అవేవీ ఫలించలేదు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. ఇతర పేలోడ్స్ అన్నీ కూడా షుప్త చేతనావస్థలో ఉన్నాయి. అప్పటికే చంద్రుడి గురించి తెలుసుకోవడానికి అవసరమైన డేటా ఇస్రోకు అందింది. అక్కడ ఆక్సిజన్ ఉందని నిర్ధారించింది.

 

ఇదే ఏడాది ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది ఇస్రో. సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి వైపునకు దూసుకెళ్లింది ఈ శాటిలైట్. లాగ్రాంజ్ పాయింట్‌‌కు చేరుకోవాల్సి ఉంది. దీని ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ప్రయోగించిన తేదీ నుంచి 124 రోజుల తరువాత ఎల్1 పాయింట్‌కు చేరుకుంటుంది ఈ శాటిలైట్.

 

Quiz Time

గగన్యాన్

మంగళయాన్ -2

ఆస్ట్రోనోవా

వ్యోమనౌట్

గగన్

NAVGEO

ఇస్రోసాట్

జియోపోస్

ఎక్స్-గేజ్

గామావ్యూ

ఆస్ట్రాక్స్

ఆస్ట్రోసాట్

సన్‌ప్రోబ్

సోలారిస్

ఆదిత్య-ఎల్ 1

సోలార్ క్వెస్ట్

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !