తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో గడ్డం ప్రసాద్‌కుమార్ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కేటీఆర్, కూనంనేని సాంబశివరావు ఉన్నారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నికకు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మద్దతిచ్చాయి.
ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ కొనసాగనున్నాయి. స్పీకర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత బీఏసీ మీటింగ్ జరుగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరిపించాలనే దానిపై చర్చిస్తారు. ఇక శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశముంది. 16న శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.