UPDATES  

 లోక్ సభ ఘటనలో నలుగురు అరెస్ట్.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు..

దేశాన్ని మొత్తం షేక్ చేసిన పార్లమెంట్‌ అలజడిపై దర్యాప్తు ప్రారంభమైంది. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్‌ లోపల, వెలుపల ఆందోళన చేసిన ఘటనలో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్‌ లోపల ఇద్దరు యువకులను, పార్లమెంట్‌ వెలుపల ఓ యువకుడు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇప్పుడు వీరందరిని వేరువేరుగా విచారిస్తున్నారు పోలీసులు.

 

పార్లమెంట్‌ వెలుపల ఆందోళన చేసిన మహిళను హర్యాణా హీస్సార్ కు చెందిన నీలమ్‌గా, యువకుడిని మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. లోపల ఆందోళన నిర్వహించిన ఇద్దరు యువకులను కూడా గుర్తించారు. సాగర్ శర్మ, దేవరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ అలజడికి కారణమన్నారు పోలీసులు. వీరిద్దరు మైసూర్ కు చెందని వారిగా గుర్తించారు. అసలు వారు ఎందుకు అలజడి సృష్టించారన్న దానిపైనే మొదట ఫోకస్‌ చేసినట్టు తెలుస్తోంది.

 

మరోవైపు పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కూడా దర్యాప్తు నిర్వహించాలని స్పీకర్‌ ఓం బిర్లా దర్యాప్తుకు ఆదేశించారు. స్మోక్‌ బాంబ్‌లు అసలు పార్లమెంట్‌ లోపలికి ఎలా తీసుకొచ్చారన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !