సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టిగా వినిపిస్తున్న పేరు. హీరోతో సంబంధం లేకుండా కేవలం తన కథ తోటే ఓ రికార్డు సృష్టించిన డైరెక్టర్ గా సందీప్ ప్రస్తుతం టాప్ ఆఫ్ టాలీవుడ్ గా మారాడు. చాక్లెట్ బాయి లాగా ఉండే రణబీర్ తో యానిమల్ మూవీ చేసి .. కథని ప్రజెంట్ చేయడానికి సమాజం పెట్టుకున్న అన్ని కట్టుబాట్లను సునాయాసంగా దాటేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు.
సందీప్ ఆలోచనలు ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి అన్న విషయం అర్జున్ రెడ్డి తో ప్రూవ్ అయింది..ఇప్పుడు యానిమల్ మూవీతో అతని ఆలోచన శైలి ఎంత వైలెంట్ గా ఉంటుంది అన్న విషయంపై అందరికీ స్పష్టత వచ్చింది. ఇక ఈ మూవీలో రణబీర్ యాక్షన్ కి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీలో చాలా కాలం గ్యాప్ తర్వాత విలన్ గా తిరిగి ఎంట్రీ ఇచ్చిన బాబి డియోల్ అద్భుతమైన నటనతో అందరిని మెప్పించాడు.
ఇక ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి నెక్స్ట్ చేయబోయే చిత్రం హీరో డార్లింగ్ ప్రభాస్ .. స్పిరిట్ టైటిల్ తో వచ్చే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదలై సంవత్సరం గడుస్తుంది..ఆ తర్వాత మూవీ పై అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు అన్న విషయం పోస్టర్ చూస్తే కన్ఫర్మ్ అవుతుంది.
ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు .. అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ అని హిందీలో నిర్మించిన భూషణ్ కుమార్ వహిస్తున్నారు. కబీర్ సింగ్ మూవీ తర్వాత వరుసగా మూడు చిత్రాలకి టీ-సిరీస్ తో సందీప్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. అందులో మొదటిది మొన్న వచ్చిన యానిమల్ మూవీ. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం సందీప్ రెడ్డి చేయబోతున్న రెండవ చిత్రం ప్రభాస్ స్పిరిట్. ఈ మూవీ వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది అని టాక్.
అయితే తెలుగులో దీని నిర్మాణ భాగస్వామి మారబోతున్నారు అని తెలుస్తుంది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. చిత్రం వివాదాల్లో చిక్కుకోవడంతో తీవ్ర నష్టానికి గురి అయింది. దీంతో మరొక సినిమాని పీపుల్స్ మీడియాకి ఇవ్వడానికి టి-సిరీస్ ఒప్పుకుందట.అందుకే స్పిరిట్ మూవీ తెలుగు రైట్స్ పీపుల్స్ మీడియా కి ఇచ్చే ఆస్కారం ఉంది.ఇదే జరిగితే ఆదిపురుష్ తో పోగొట్టుకున్న మొత్తం తిరిగి రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్.