UPDATES  

 బింబిసార 2 పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

నందమూరి కల్యాణ్ రామ్ బ్రిటిష్ గూడచారి గా.. అభిషేక్ నామా నిర్మిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం డెవిల్.సంయుక్త మీనన్, మాళవిక నాయర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 29వ తేదీన గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్న చిత్ర బృందం నిన్న మూవీకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. బ్రిటిష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ లుక్స్ అదిరిపోతున్నాయి అన్న విషయం టీజర్ లో అర్థమైంది.. కానీ ఇందులో భారీ యాక్షన్స్ సన్నివేశాలతో పాటు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు అన్న విషయం ట్రైలర్ తో క్లియర్ అయిపోయింది.

 

మొత్తానికి ప్రస్తుతం డెవిల్ ట్రైలర్ మంచి పాజిటివ్ బజ్ తో దూసుకెళ్తోంది. మంచి కథ ,కథనాలతో సినిమాని రూపొందించడమే కాకుండా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన తన నటనతో ఎంటర్టైన్ చేసే నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో.. కళ్యాణ్ రామ్ సినిమాలపై క్రేజ్ విపరీతంగా పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆమిగోస్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం రాబోతున్న పీరియాడిక్ మూవీపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.

 

నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన కళ్యాన్ రామ్.. డెవిల్ మూవీ లో కమర్షియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి అని అన్నారు. పైగా ఈ మూవీ 1940 బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పీరియాడిక్ మూవీ కావడంతో ..దానికి సంబంధించిన సెట్స్ డిజైన్ చేయడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడింది అని మెచ్చుకున్నారు. ఒకపక్క డైరెక్టర్ గా మరొక పక్క ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న అభిషేక్ నామ ఈ మూవీకి సంబంధించి ఖర్చుకి అస్సలు వెనకాడలేదు అని అన్నారు.

 

ఈ నేపథ్యంలో బింబిసార సీక్వెల్ గురించి ఎదురైన ప్రశ్న కళ్యాణ్ రామ్ స్పందించారు. బింబిసార కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోని అత్యంత గ్రాస్ వసూలు సొంతం చేసుకున్న సినిమా. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంది అని అప్పట్లో చెప్పారు తప్ప ఆ తర్వాత ఆ ప్రస్తావనే లేదు ఇక ఇప్పటికీ ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కాస్త క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం మే నెలలో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని.. తప్పకుండా మీ అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తామని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ మాత్రం మారే ఆస్కారం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. ఇక బింబిసార 2 మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !